డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ రచయిత
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన స్పెష ల్ డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులు అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సినీ దర్శకుడు, రచయిత ఒకరు పోలీసులకు చిక్కారు.
అదే కారులో ఓ ప్రముఖ దర్శకుడూ ఉన్నారు. సదరు రచయితపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడినవారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.