'మీ ఓటును సరి చూసుకోండి'
బంజారాహిల్స్ : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలో ఓటరు జాబితాల్లో ప్రజలు తమ వివరాలను తెలుసుకోవడానికి, నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, చిరునామా మార్పు, ఫొటోల సవరణపై ఆదివారం ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్-10(ఏ,బీ) ఉప కమిషనర్లు మహేందర్, సామ్రాట్ అశోక్ శనివారం తెలిపారు.
ఈ రెండు నియోజక వర్గాల పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్లోను బూత్‌లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఓటర్లు అన్ని వివరాలను తెలుసుకోవడానికి వీలుంటుందని చెప్పారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాతో పాటు ఫారం-6,7, 8, 8ఏలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.