విజయనగరం వాసికి రాష్ట్రపతి అవార్డు
విజయనగరం టౌన్ : సీఆర్పీఎఫ్ డీఐజీగా తరాలు(బెంగళూరు)లో విశేష సేవలందిస్తున్న విజయనగరానికి చెందిన ఆరాధ్యుల శ్రీనివాస్ సీఆర్పీఎఫ్ డీజీ దిలీప్ త్రివేదీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డును బుధవారం అందుకున్నారు. సర్వీసులో ఉత్తమ సేవలందించినందుకుగాను రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈయన ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయనగరంలోని మహారాజ మోడల్ హైస్కూల్లో, ఇంటర్, డిగ్రీ మహారాజ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఉత్తరాంధ్రలో సీఆర్పీఎఫ్లో కమాం డెంట్ ఆఫీసర్‌గా పని చేసి, అంచలంచెలుగా ఎదిగారు. 20 ఏళ్ల పాటు అందించిన సేవలకుగాను ప్రభుత్వం అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందని ఆయన సాక్షికి తెలిపారు. శ్రీనివాస్‌కు రాష్ట్రపతి రావడం పట్ల భార్య పద్మజ, పిల్లలు మేఘన, విష్ణు, తండ్రి ఏవీజీ కృష్ణ, లక్ష్మీయశోద(బాలమ్మ), బావమరిది పిడపర్తి సాంబశివశాస్త్రి, కుటుంబ సభ్యులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.