పాఠశాలలో ముందుపాతరలు ఉన్నాయంటూ నకిలీ ఫోన్
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలోని ఓ పాఠశాల అవరణలో మందుపాతరలు అమర్చినట్లు ఫోన్ కాల్ రావడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం అందించింది. దాంతో హుటాహుటన పోలీసులు పాఠశాలకు చేరుకుని, పాఠశాలలోని విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 400 మందిని అక్కడి నుంచి తరలించింది.
అనంతరం బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాలలో అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. దాదాపు మధ్యాహ్నం 1.30లకు వరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి మందుపాతరలు లేవని బాంబు నిర్వీర్య బృందాలు నిర్థారణకు వచ్చాయి. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ గుర్తించవలసి ఉందని, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది.