వాట్సాప్‌లో స్టార్ మెసేజీలు
ఈరోజు వాట్సప్ వాడారా? ఏదైనా తేడాగా అనిపించిందా? ఒకే సస్పెన్స్ ఎందుకుగానీ విషయం ఇదీ... వాట్సప్‌లో కొన్ని కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది స్టార్ మెసేజ్‌ల గురించి. ఇటీవలే విడుదలైన వాట్సప్ 2.12.367 వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ వచ్చి చేరింది. వాట్సప్ సందేశాల్లో మనకు కావాల్సిన వాటిని వెంటనే చూసుకునేందుకు వీలుగా దానిపై స్టార్ గుర్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. వాట్సప్‌లోని ఆప్షన్స్ సెక్షన్లో ఉంటుంది ఈ ఫీచర్.
ఏ సందేశాన్నైనా కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే స్క్రీన్ పై భాగంలో స్టార్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఆ సందేశం ప్రత్యేకమైందిగా సేవ్ అవుతుంది. ఒకే సందేశాన్ని పలుమార్లు పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక రెండో కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ డెరైక్ట్ షేర్‌తో పనిచేయగలగడం.
ఇది మార్ష్‌మెల్లో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఏవైనా లింక్‌లను వాట్సప్ ద్వారా షేర్ చేసుకోవడం దీని ద్వారా సులువు అవుతుంది. దీంతోపాటు మనం షేర్ చేసుకునే లింక్‌ల రిచ్ ప్రీవ్యూను కూడా ఒక ఫీచర్‌గా పరిచయం చేశారు.