ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
కడప కల్చరల్ : ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం ప్రారంభమైంది. అధికారుల పర్యవేక్షణలో ఉదయం స్టెప్ కార్యాలయం వద్దగల ఇండోర్ స్టేడియంలో అభ్యర్థులకు రాత పరీక్ష, అనంతరం రామకృష్ణ మిషన్ వద్దగల బైపాస్‌రోడ్డులో అధికారులు యువకులకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు.
శనివారం ఉదయం ఇండోర్ స్టేడియంలో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మరో విడత రాత పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం రాత పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని స్టెప్ సీఈఓ మమత తెలిపారు. ఆదివారం నుంచి ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ ఉద్యోగానికి రాత పరీక్షలు, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ఉంటాయని ఆమె తెలిపారు.