రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి ఎన్నిక
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన జి.రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన అశోక్‌బాబు ప్యానెల్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్‌లో జిల్లాకు సంబంధించి 56 మంది ఓటర్లు ఉండగా, 54 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న బాలనారాయణ, ఆలూరు తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్న ఎస్.కె.సత్యనారాయణలు పదవీ విరమణ పొందడంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడుగా అశోక్‌బాబుతో పాటు ఉపాధ్యక్షుడుగా జి.రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడం పట్ల జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, శ్రీరాములు, నగర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, జయరామకృష్ణారెడ్డి, జిల్లా కోశాధికారి రామకృష్ణారెడ్డి తదితరులు హర్షం ప్రకటించారు.