station bail
-
ఆధారాల్లేక వెనక్కు తగ్గిన పోలీసులు
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ చంద్రగిరి ఇన్చార్జ్, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకుండానే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆరి్థక ఉగ్రవాది, టెర్రరిస్ట్ అన్న తరహాలో మోహిత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచేందుకు పోలీసులు వెనకడుగు వేశారు. మోహిత్‌రెడ్డిపై మోపిన అభియోగాల్లో ఆధారాలు లేకపోవడం, ఘటన జరిగిన సమయంలో జిల్లా మెజి్రస్టేట్ హోదాలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారుల సమక్షంలోనే సీసీ కెమెరాల సాక్షిగా మోహిత్‌రెడ్డి ఉండడం, ఆ సమయంలో కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేకపోవడం.. తదితర కారణాల వల్ల పోలీసులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని 41(సీ) నోటీసులు ఇచ్చి పంపించేశారు. ప్రజల మధ్యే ఉంటూ, సొంతూరులో పోలీసుల కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో తనకు సంబంధంలేని ఘటనలో 52 రోజుల తర్వాత ఏ–37గా కేసు పెట్టారు.వంద కేసులు పెట్టినా భయపడం విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచి్చన నాపై ఇది మొదటి కేసు. ఇలాంటి అక్రమ కేసులు వంద పెట్టినా, బుల్లెట్లతో కాలి్చనా వెనక్కి తగ్గేది లేదు. ఈ కేసులో నా ప్రమేయం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. మా నాన్న నాకు ప్రజలకు సేవ చేయడం, ప్రజల పక్షాన పోరాడటమే నేరి్పంచారు. మమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తానని పులివర్తి నాని కలలు కంటున్నారు. అది ఆయన తరం కాదు. – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దమ్ముంటే జడ్జి ముందుహాజరు పరచాలి ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో పేరు కూడా లేని వ్యక్తిని 52 రోజుల తర్వాత ఏ–37గా ఇరికించడం అప్రజాస్వామికం. «ఇది తప్పుడు కేసు అని ప్రభుత్వానికి, పోలీసులకు కూడా తెలుసు. ఎవరిని తృప్తి పరిచేందుకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.. అరెస్ట్ చేశారు? పోలీసులకు దమ్ము, ధైర్యం ఉంటే అరెస్ట్ చేసిన మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరు పరచాలి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. -
ఆ చట్టం..నిందితుల చుట్టం!
ప్రకాశం, చీరాల రూరల్: ఎలాంటి కేసులన్నా మాకేం లెక్కలేదు.. కర్రలు, కత్తులతో దాడి చేస్తాం.. ఎంతకైనా తెగిస్తాం.. ఏమైనా చేస్తాం...అవసరమైతే లేపేసేస్తాం.. పోలీసుస్టేషన్లో ఎంతైనా పడేసి దర్జాగా ఇంటికెళ్లిపోతాం.. ఇదీ.. ప్రస్తుతం పోలీసుస్టేషన్ల వద్ద నిందితుల తీరు. ఇదేమిటి ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు..దీనికి కారణం ఏమై ఉంటుందని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనంతటికి ఓ సెక్షన్ నిందితులకు చుట్టంగా మారింది. సీఆర్సీసీ సెక్షన్ 14 (ఏ) సీఆర్పీసీ సెక్షన్ 41 (ఏ) నోటీసు ప్రస్తుతం నిందితులకు వరంగా మారింది. ఈ నోటీసు సారాంశం ఏమంటే ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులన్నింటికీ పోలీసుస్టేషన్లో పోలీసులే స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చనమాట. ఈ 41 (ఏ) నోటీసు చట్టం రెండేళ్లకుపైగా పోలీసు స్టేషన్లలో అమలులో ఉంది. గతంలో అయితే.. గతంలో ఇళ్ల వద్ద చిన్నచిన్న గొడవలు జరిగినా.. ఎవరినైనా చంపుతామని బెదిరించినా.. ఒకరిని కర్రలతో కొట్టినా.. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసులు పెడితే పోలీసులు కేసు నమోదుచేసి దాడికి పాల్పడిన నిందితులపై కేసులు నమోదు చేసి వెంటనే కోర్టులో హాజరు పరుస్తారు. ఆ కేసు బెయిల్ ఇవ్వదగినదని న్యాయమూర్తి భావిస్తే నిందితునిగా ఉన్న వ్యక్తికి తక్షణమే బెయిలు పొందే సౌకర్యం ఉంటుంది. ఇక్కడ బాధితుడు కొంత వరకు ఉపశమనం పొందుతాడు. తనను కొట్టిన వ్యక్తి కోర్టు వరకు వెళ్లాడని సంతోషపడతాడు. నిందితుడు కూడా కోర్టులో అందరూ తనను ఒక దోషిలా చూశారని కుమిలిపోతాడు. బెయిల్ ఇవ్వదగిన కేసయితే నిందితుని తరఫున ఇద్దరు జామీను (ఆస్తి పూచీకత్తు) దారులు కోర్టులో హాజరై నిందితుడు తనకు తెలుసునని జామీనుదారులుగా ఉండి ఆ మేరకు న్యాయమూర్తికి విన్నవించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి నిందితునికి బెయిల్ మంజూరు చేస్తారు. దీని వలన బాధితుడు కొంత వరకు తనకు న్యాయం జరిగిందని, నిందితునికి తగిన శాస్తి జరిగిందని ఆనందపడతాడు. కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తికి కూడా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కోర్టులన్నా.. పోలీసు స్టేషన్లన్నా కొంత వరకు భయపడే అవకాశం ఉంటుంది. పెద్ద కేసులకు రిమాండ్ తప్పదు ఏడేళ్లలోపు కేసులన్నింటికీ పోలీసుస్టేషన్లలో బెయిల్ పొందే సౌకర్యాన్ని సెక్షన్ 41 (ఏ) కల్పిస్తోంది. ఏడేళ్లు అంతకంటే పైబడిన కేసుల్లోని నిందితులను మాత్రం పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఏడేళ్లకు పైబడిన కేసులంటే ఉదాహరణకు 307, 376, 326, 353, 354 సెక్షన్లు కలిగిన కేసులన్నమాట. వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కత్తి లేదా ఇతర ఇనుప లోహంతో తయారు చేసిన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడటం, మహిళను రేప్ చేసేందుకు ప్రయత్నించడం, విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు సక్రమంగా చేయకుండా అటంక పరచడం, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే దొంగలకు సంబంధించిన కేసులన్న మాట. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా వేలాది కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతుంటాయి. వాటిల్లో ఏడేళ్లలోపు కేసులే అధికంగా ఉంటాయి. వాటిల్లో భార్యాభర్తల కేసులు 498 (ఏ) కేసులు, కొట్లాట కేసులు కూడా ఉంటాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి స్టేషన్లోనే సీర్పీపీసీ 41 (ఏ) సెక్షన్ కింద పోలీసులు నోటీసు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఇద్దరు పెద్ద మనుషులు తమ ఆధార్ కార్డులు జిరాక్స్‌లతో పోలీసుస్టేషన్‌కు వచ్చి నిందితునికి జామీనుగా ఉంటామని పోలీసులకు తెలియజేసి ఆధార్ కార్డు జిరాక్స్‌లు సమర్పించాల్సి ఉంటుంది. రూ.5 నుంచి 20 వేలకుపై మాటే ఇటువంటి కేసుల్లో నిందితులు పోలీసుస్టేషన్లలో 41 (ఏ) నోటీసు బెయిల్ పొందాలంటే ఆయా పోలీసుస్టేషన్లలో డబ్బులు దండిగా ముట్టచెప్పాల్సిందే. ఆయా కేసుల తీవ్రతను బట్టి నిందితుని వద్ద ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒక్కో కేసులో సుమారుగా రూ. 5 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయా కేసుల్లో నిందితునికి నోటీసు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే విషయం ఆయా స్టేషన్ ఎస్హెచ్ఓపై ఆధారపడి ఉంటుంది. నిందితుడు డబ్బులు సరిగా ముట్టచెప్పని పక్షంలో అతనిపై రిమాండ్ రిపోర్టులో అదనంగా ఆరోపణలు రాసి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. న్యాయవాదులకు తగ్గిన ప్రాక్టీస్ ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు 41 (ఏ) నోటీసు (బెయిల్) పొందే అవకాశం పోలీసుస్టేసన్లు కల్పించడంతో క్రిమినల్ సైడ్ ప్రాక్టీసు చేసే న్యాయవాదులకు ప్రాక్టీసు తగ్గిపోయింది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు గొడవ జరిగిన కొద్ది రోజుల్లోనే బాధితుల మందు దర్జాగా ఇద్దరు పెద్ద మనుషులను స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేషన్లో సంతకాలు చేసి ఇంటికి వెళ్తున్నారు. అదే మామూలు రోజుల్లో అయితే ఏ చిన్న గొడవ జరిగినా ముందుగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టులో హాజరు పరిచేంత వరకు నిందితుడు పోలీసుల అదుపులో ఉంటాడు. ప్రస్తుతం అమలులో ఉన్న నోటీసులతో నిందితులు చాలా సులభంగా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోతున్నారు. అదే నిందితుడిని కోర్టులో హాజరు పరిస్తే ఇద్దరు జామీనుదారులతో కోర్టుకు హాజరై బెయిల్ పొందేందుకు ముందుగా న్యాయవాదిని కలవాల్సి ఉంటుంది. ఎంతోకొంత ముందుగా న్యాయవాదికి ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 41 (ఏ) నోటీసు ద్వారా నిందితుడికి ఇవన్నీ తప్పాయి. అన్నింటి కంటే ముఖ్యంగా బాధితునికి కనీస న్యాయం జరగడం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 41 (ఏ) రద్దు కోరుతున్న న్యాయవాదులు న్యాయవాదుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన 41 (ఏ) నోటీసు రద్దు చేయాలని న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోరుతున్నారు. ఇటీవల జరిగిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు తాము గెలిస్తే 41 (ఏ) రద్దు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముద్రించి ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
-
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
అనంతపురం: బాగేపల్లి టోల్‌ప్లాజాపై దాడి కేసులో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులను బెయిల్ పై విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాగేపల్లి పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్‌లను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మాపై దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెడతారా అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త ఫర్నీచర్ కొనిస్తామని ఎంపీ నిమ్మల కిష్టమ్మ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగలగొట్టారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని బాధితులను బెదిరించారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
స్టేషన్ బెయిల్ రద్దు?
స్టేషన్ బెయిల్ విధానం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని కూడా పత్రికల్లో రాస్తున్నారు. మీడియాలో పోటీ పెరిగి న్యాయకోవిదులను విచారించకుండానే వార్తలు రాస్తున్నారు. ఇది సరైంది కాదు. స్టేషన్ బెయిల్ రద్దయిందని వారం రోజులుగా చాలా వార్త లు వచ్చాయి. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సెక్షన్ 41ఏ నుంచి 41 డిలను తొలగించారని చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ వార్తలు న్యాయవాదుల్లో, న్యా యమూర్తులో,్ల పోలీసుల్లో గం దరగోళం సృష్టిస్తున్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవ రణల చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా ఈ నిబంధనలని చట్టంలో ఏర్పాటు చేశారు. ఇవి 1 నవం బర్ 2010 నుంచి అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 41ఏ ప్రకా రం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్షను విధించే అవ కాశం ఉన్న కేసుల్లో లేదా ఏడు సంవత్సరాల వరకు శిక్ష ను విధించే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టు చేయకుండా హాజరుకమ్మని నోటీసులని పోలీసులు ఇస్తే సరిపోతుం ది. ఆ నోటీసు ప్రకారం ఆ వ్యక్తి నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీలులేదు. ఆ నోటీసు ప్రకా రం వ్యవహరించలేదని పోలీసు అధికారి భావించినప్పు డు తగు కారణాలను నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. కొన్ని ప్రత్యేక కారణాలు రాసి కూడా ముద్దాయిలను అరెస్టు చేయవచ్చు. ఈ నిబంధన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని కష్టాలూ ఉన్నా యని అనుభవంలో తేలింది. ఇదిలా ఉంటే - కేంద్ర ప్రభుత్వం రిపీలింగ్ అండ్ అమెండింగ్ (సెకండ్) యాక్ట్, 2015 (తొలగింపు మరి యు సవరణల (రెండవ) చట్టం, 2015) ద్వారా, అదే విధంగా తొలగింపు మరియు సవరణల చట్టం 2015 ద్వారా చాలా చట్టాలని తొలగించింది. అందులో క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్ సవరణల చట్టం, 2008 కూడా ఉం ది. ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా అరెస్టు నిబంధనలకి చేసిన సవరణలు, చేర్చిన కొత్త నిబం ధనలు తొలగిపోయాయని అందరూ తప్పుగా భావించి స్టేషన్ బెయిల్ రద్దయిందని అనుకుంటున్నారు. మీడి యా ఇలాంటి వార్తలని ప్రచురించి, ప్రసారం చేసి గంద రగోళం సృష్టించింది. ఈ గందరగోళానికి తెరదించా లన్న ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ తొలగింపు మరియు సవరణల ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ చట్టాల్లోని సెక్షన్ 4ని అదే విధంగా జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 6ఏని చదవాలి. వాటి ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ గందరగోళం ఏర్పడదు. జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం - ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాసనాన్ని తొలగిస్తే ఆ తొలగించిన చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు తొలగిపోవు. అవి తొలగించిన ట్టుగా ప్రత్యేకంగా చెప్పినప్పుడు మాత్రమే అవి తొలగి పోతాయి. జనరల్ క్లాజెస్ చట్టంలోని 6ఏ ప్రకారం సవ రణల చట్టాలు తొలగిపోతాయి. ఆ సవరణల చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు అలాగే ఉంటాయి. అంతే కాదు అవి సంబంధించిన వాటిని పరిపాలిస్తాయి. ‘‘కూడా బక్ష్ వర్సెస్ మేనేజర్ కెలెడోనియన్ (ఏఐ ఆర్ 1954 కలకత్తా 484)’’లో ఇదే విషయం చర్చకు వచ్చింది. ఆ కేసులో కలకత్తా కోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది. ‘‘తొలగింపు చట్టాల ఉద్దేశం వేరు. ఆ సవరణల చట్టం ద్వారా మూల శాసనంలో చేరిన నిబంధనలని తొలగించటం కాదు. వాటిని ప్రభావితం చేయడం కాదు. దేశంలో చట్టాల పరిమాణాలని తగ్గించడం ఈ చట్టాల ఉద్దేశం. మూల చట్టంలో చేరిన సవరణలు, కొత్తగా చేరిన నిబంధనలు మూల చట్టంలో భాగమైపో తాయి. దాంతో సవరణ చట్టం ఉద్దేశ్యం నెరవేరుతుంది. అందుకని ఆ సవరణల చట్టం ఉనికి ఇంకా అవసరం ఉండదు. అలాంటి రక్షించే నిబంధనల తొలగింపు చట్టంలో ఉంటుంది.’’ సవరణల చట్టం ద్వారా కొత్త నిబంధనని చేర్చినా, ఉన్న నిబంధనలకి సవరణలని చేసి చట్టాలను తొల గించడం కోసమే కేంద్ర ప్రభుత్వం తొలగింపు సవరణల చట్టాలని తెస్తాయి. కేంద్ర ప్రభుత్వం మరియు తొలగింపు సవరణల చట్టం, 2015 ప్రకారం 35 సవరణల చట్టాలని తొలగిం చారు. రెండు సవరణల చట్టాల్లో మార్పులు చేశారు. అదే విధంగా తొలగింపు సవరణల (రెండవ) చట్టం 2015 ద్వారా 90 సవరణల చట్టాలని తొలగించారు. రెం డు సవరణ చట్టాల్లో మార్పులు తెచ్చారు. మీడియాతో బాటు న్యాయవాదులు, న్యాయమూ ర్తులు భ్రమపడుతున్నట్టు అరెస్టు చట్టాలు శాసనంలో ఉన్నాయి. పోలీసుల అధికారాలు పోలేదు. అయితే అది స్టేషన్ బెయిల్ కాదు. సెక్షన్ 41ఏ నుంచి 41 బి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో అరెస్టు చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఈ నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరు చేసే అధికారం పోలీసులకి లేదు. మీడియా అనవసరంగా స్టేషన్ బెయిల్ అని ఉదహరిస్తుంది. ఇకపోతే బెయిలబుల్ (బెయిల్ హక్కుగా పొందే వీలున్న నేరాలు) నేరాల్లో పోలీసులు విధిగా ముద్దాయి లకు బెయిల్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. నాన్ బెయిలబుల్ నేరాల్లో బెయిల్ మంజూరు చేసే అధికారం పోలీసులకి లేదు. నాన్ బెయిలబుల్ నేరాల్లో ఎవరినైనా అరెస్టు చేసిన తరువాత ఆ ముద్దాయి నాన్ బెయిలబుల్ నేరం చేశాడనడానికి సహేతుకమైన కారణాలు లేవని పోలీసులు భావించినప్పుడు మాత్రమే క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లోని సెక్షన్ 437(2) ప్రకారం బెయిల్ మం జూరు చేయవచ్చు. అంటే! వార్తలు ప్రచురించే ముందు, వార్తా కథ నాలు ప్రసారం చేసే ముందు సంబంధిత విజ్ఞులను సం ప్రదిస్తే మంచిది. లేకపోతే గందరగోళం సృష్టించిన వాళ్లుగా మిగిలిపోతారు. వ్యాసకర్త డెరైక్టర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ మొబైల్: 94404 83001 - మంగారి రాజేందర్