Sun Pharmaceutical
-
సన్ ఫార్మా- ఉత్తమ్ గాల్వా.. భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి సన్ ఫార్మా కౌంటర్ వరుసగా రెండో రోజు లాభాలతో సందడి చేస్తుంటే.. ఉత్తమ్ గాల్వా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సన్ ఫార్మాస్యూటికల్ నికర లాభం 70 శాతం ఎగసి రూ. 1,813 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 5 శాతమే పెరిగి రూ. 8,553 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం మెరుగుపడి 25.6 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 518ను అధిగమించింది. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ. 508 వద్ద ట్రేడవుతోంది. వెరసి గత రెండు రోజుల్లో ఈ షేరు 11 శాతంపైగా ర్యాలీ చేసింది. ఉత్తమ్ గాల్వా స్టీల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఉత్తమ్ గాల్వా స్టీల్ రూ. 19.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 335 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 142 కోట్ల నుంచి రూ. 195 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 321 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 6.50 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీకి సంబంధించి కార్పొరేట్ రుణచెల్లింపుల రిజల్యూషన్ చేపట్టేందుకు ఎస్బీఐకు ఎన్సీఎల్టీ అనుమతించింది. -
స్పార్క్- పీఐ ఇండస్ట్రీస్.. లాభాల స్పార్క్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్ అరౌండ్ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇదే కాలంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆగ్రి కెమికల్స్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో సన్ ఫార్మా అడ్వాన్స్డ్ దాదాపు రూ. 57 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 94 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 971 శాతం జంప్‌చేసి రూ. 185 కోట్లను తాకింది. ఈ కాలంలో గత నష్టాల నుంచి బయటపడుతూ రూ. 61 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇబిటా మార్జిన్లు 5.8 శాతం ఎగసి 32.8 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత స్పార్క్ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 200కు చేరింది. ప్రస్తుతం 8.3 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. పీఐ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పీఐ ఇండస్ట్రీస్ నికర లాభం 43 శాతం వృద్ధితో రూ. 146 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 41 శాతం పెరిగి రూ. 1060 కోట్లకు చేరింది. ఇబిటా 55 శాతం అధికంగా రూ. 236 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత పీఐ ఇండస్ట్రీస్ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1,960కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.5 శాతం జంప్‌చేసి రూ. 1,900 వద్ద ట్రేడవుతోంది. -
డీల్ విలువ రూ.19,200 కోట్లు..
న్యూఢిల్లీ: దేశంలో మరో మెగా ఫార్మా డీల్‌కు తెరలేచింది. అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్... మరో దిగ్గజ కంపెనీ ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ను చేజిక్కించుకుంది. ఇరు కెంపెనీలు ఈ విషయాన్ని సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. పూర్తిగా స్టాక్స్ కేటాయింపు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం విలువ 320 కోట్ల డాలర్లు(దాదాపు రూ.19,200 కోట్లు). ఈ డీల్ పూర్తయితే తమ ఉమ్మడి కంపెనీ... దేశంలో నంబర్ వన్ ఫార్మా కంపెనీ కానుందని సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద స్పెషాలిటీ జెనరిక్స్ తయారీ సంస్థగా ఆవిర్భవించనుందని కూడా వెల్లడించాయి. ఇరు కంపెనీల మొత్తం ఆదాయం దాదాపు 420 కోట్ల డాలర్లు(సుమారు రూ.25,000 కోట్ల పైచిలుకే)గా అంచనా. జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో మెజారిటీ వాటాదారుగా ఉన్న ర్యాన్‌బాక్సీ ఇటీవల కాలంలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) నుంచి నిషేధాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన రెండేళ్లలో దేశంలో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద కొనుగోలు డీల్‌గా ఇది నిలుస్తుండటం గమనార్హం. ప్రతిపాదిత డీల్‌కు సన్ ఫార్మా డెరైక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీల బోర్డులు డీల్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి కోసం సిఫార్సు చేశాయి. ఒప్పందం స్వరూపం ఇదీ... ప్రతిపాదిత డీల్ ప్రకారం.. ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరుకి 0.8 సన్‌ఫార్మా షేరును కేటాయించనున్నారు. అంటే ప్రతి ర్యాన్‌బాక్సీ వాటాదారులకు ప్రతి 5 షేర్లకు... 4 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయన్న మాట. ర్యాన్‌బాక్సీ షేరు విలువ రూ.457 చొప్పున ఈ డీల్ కుదుర్చుకున్నట్లు లెక్క. గడిచిన 30 రోజుల సగటు షేరు ధరపై 18 శాతం అధిక మొత్తానికి... 60 రోజుల సగటు ధరపై 24.3 శాతం ప్రీమియంను సన్ ఫార్మా ఆఫర్ చేసినట్లవుతుంది. అయితే, 2008లో ర్యాన్‌బాక్సీలో 63.4 శాతం మేర వాటాను జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో సుమారు 460 కోట్ల డాలర్లకు(అప్పటి కరెన్సీ విలువ ప్రకారం దాదాపు రూ.22,000 కోట్లు) కొనుగోలు చేయడం విశేషం. ఒక్కో షేరుకి సుమారు రూ.737 చొప్పున చెల్లించింది. తద్వారా ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివీందర్ సింగ్‌లు సంస్థ నుంచి వైదొలిగారు. కాగా, అప్పటి డీల్ ప్రకారం చూస్తే... ఇప్పుడు దైచీ శాంక్యోకు ర్యాన్‌బాక్సీలో ఉన్న వాటాకు చాలా తక్కువ మొత్తమే లభిస్తోంది. సన్ ఫార్మా ప్రమోటర్లకు ప్రస్తుతం ఆ కంపెనీలో 63.7 శాతం వాటా ఉంది. షేర్ల కేటాయింపు కారణంగా ఈ డీల్ పూర్తయితే సన్ ఫార్మాలో దైచీ శాంక్యో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తుంది. సన్ ఫార్మాకు ఏంటి ప్రయోజనం... ర్యాన్‌బాక్సీని సొంతం చేసుకోవడం వల్ల సన్ ఫార్మాకు ప్రపంచవ్యాప్తంగా అయిదు ఖండాల్లోనూ 65 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం దక్కుతుంది. 47 తయారీ ప్లాంట్లు ఈ ఉమ్మడి సంస్థ చేతిలో ఉంటాయి. ప్రపంచ స్పెషాలిటీ, జనరిక్ ఔషధ ఉత్పత్తుల మార్కెట్లో గణనీయమైన వాటాను సన్ ఫార్మా చేజిక్కించుకోగలుగుతుంది. దీంతోపాటు 629 కొత్త ఔషధ దరఖాస్తులు(ఆండాస్) కూడా లభిస్తాయి. గతంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఫార్మా కంపెనీలను తక్కువ మొత్తాలకు చేజిక్కించుకుని వాటిని లాభాల బాటలోకి తీసుకొచ్చిన అనుభవం, సామర్థ్యం సన్‌ఫార్మా సొంతం. అమెరికాకు చెందిన కరా కో ఫార్మా, ఇజ్రాయెల్ సంస్థ టారో ఫార్మాలను ఇదే విధంగా దక్కించుకుని గాడిలో పెట్టగలిగింది. ఇప్పుడు ర్యాన్‌బాక్సీ డీల్‌కు కూడా సన్ ఫార్మా చాలా తక్కువే చెల్లిస్తోందనేది విశ్లేషకులు అభిప్రాయం.