నాలాల సర్వేకు మోకాలడ్డు!
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో వాననీటి కష్టాలకు కారణమైన నాలాలను ఆధునీకరించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ మేరకు ముందుగా చేపట్టిన నాలాల సర్వే పనులకు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నారని తెలుస్తోంది.
ఆధునీకరణలో భాగంగా కోల్పోయే వ్యక్తిగత ఆస్తుల కొలతలు తీసుకునేందుకు వారు అడ్డుపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఈపనులు ముందుకు సాగడం లేదు. ఇలా.. విస్తరణలో భాగంగా కోల్పోనున్న 238 ఆస్తుల(భవనాల) కొలతల్ని అధికారులు ఇప్పటికీ తీసుకోలేకపోయారు. ప్రజా ప్రతినిధులు అడ్డుకోవడంతో ఆస్తుల విస్తీర్ణం లెక్కించలేకపోయిన ప్రాంతాలు.