మంత్రి కామినేనితో జూడాల చర్చలు సఫలం!
తిరుపతి: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాసరావు జరిపిన చర్చలు శుక్రవారం సాయంత్రం సఫలమయ్యాయి. జీవో 78ను రద్దు చేసి స్విమ్స్‌కు బదలాయించిన భవనాలు మెటర్నిటి విభాగానికి తిరిగి ఇవ్వడానికి మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
దాంతో సమ్మె విరమణకు జూడోలు సానుకూలంగా స్పందించారు. అయితే శనివారం ఉదయం సమావేశమై సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని జూడాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 78పై నిరసన తెలుపుతూ జూడోలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.