తియ్య టీ!
ఒత్తిడి నుంచి బయటపడడానికి ‘స్వీట్ టీ’ సేవనం మంచి మార్గం అంటుంది తాజా అధ్యయనం. ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
‘‘స్వీట్ టీ వల్ల ఒత్తిడి నుంచి బయట పడొచ్చు అని చెప్పడానికి మా అధ్యయన ఫలితాలు తొలి ఆధారంగా నిలుస్తాయి’’ అంటున్నారు పరిశోధకులలో ఒకరైన డా.కెవిన్.