స్వైన్‌ఫ్లూతో తెలంగాణలో 41మంది మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తాజాగా బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకూ స్వైన్‌ప్లూ బారినపడి 41మంది మృతిచెందినట్టు నిర్థారించింది. నిన్నటివరకూ 90 శాంపిల్స్‌ను పరీక్షించగా, 30మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది.
స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలను ప్రజలు కొనసాగించాలని, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. ఒకవేళ తీవ్రమైన దగ్గు, జ్వరం ఉన్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.