‘పాలిసెట్’కు ఏర్పాట్లు పూర్తి
21న పరీక్ష నిర్వహణ
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ ఉచిత సరఫరా
రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ శ్యాంసుందర్‌రెడ్డి
రామంతాపూర్, న్యూస్‌లైన్: పాలిటెక్నికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిసెట్’ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రామంతాపూర్ ప్రభుత్వ జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పాలిసెట్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను తమ కళాశాల చేపట్టిందన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరని తెలిపారు. పరీక్ష నిర్వహణకు రామంతాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, ఉప్పల్ పరిధిలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో మొత్తం 7,016 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. పరీక్షకు హాజరయ్యేవారికి పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను https://apceep.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..
హబ్సిగూడ: విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, ఒమెగా డిగ్రీ కాలేజీ, ఒమెగా జూనియర్ కాలేజీ, నారాయణ జూనియర్ కాలే జీ, సిల్వర్ జూబ్లీ జూనియర్ కాలేజీ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, ఐఐసీటీ జహీర్ మెమోరియల్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్ వీధి నంబర్-8 హబ్సిగూడ.
రామంతాపూర్: క్రైస్ ది కింగ్ స్కూల్, మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, క్రాంతి డిగ్రీ కాలేజీ, ప్రిన్స్‌స్టన్ డిగ్రీ కాలేజీ, జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రిన్స్‌స్టన్ పీజీ కాలేజీ.
ఉప్పల్: లిటిల్ ఫ్లవర్ స్కూల్.
ఓయూ క్యాంపస్: దుర్గాబాయి దేశ్‌ముఖ్ విద్యాపీఠం, ఏఎంఎస్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ.