Syed Abdul
-
#Maidaan: రియల్ హీరో రహీం సాబ్.. స్కూల్ టీచర్ నుంచి కోచ్ దాకా!
స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ రవీంద్రనాథ్ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్ అబ్దుల్ రహీం కథ. భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు ఏమిటి?.. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు. ముప్పై ఏళ్ల వయసులో కమార్ క్లబ్, యూరోపియన్ క్లబ్ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కోచ్గా మారారు. రహీం సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్ క్లబ్ మూడు డ్యూరాండ్, ఐదు రోవర్స్ కప్‌లు గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు కోచ్‌గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది. స్వర్ణ యుగం 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్ రన్ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా రహీం సాబ్ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. రహీం గైడెన్స్‌లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి పసిడి పతకం సాధించింది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్ తంగరాజ్ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్‌బాల్ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు. బ్రిటిష్ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు 1958, 1962 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్ ఉన్నంతకాలం భారత్ ఫుట్‌బాల్ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రహీం సాబ్.. 1963లో కాన్సర్ బారిన పడ్డారు. ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అదే ఏడాది జూన్‌లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్ ఫుట్‌బాల్ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్ సాబ్ తనతో పాటు ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. గుర్తింపు దక్కని యోధుడు భారత ఫుట్‌బాల్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్‌కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! ఎంతో మందిని మేటి ఫుట్బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్ కొడుకు సయ్యద్ షాహిద్ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మైదాన్ సినిమాతో నేటి తరానికి తెలిసేలా సయ్యద్ అబ్దుల్ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. -
బ్యాక్ టు బ్యాక్
ప్రస్తుతం ప్రపంచమంతా సాకర్ ఫుట్‌బాల్ ఫీవర్‌లో ఉంది. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మూవీని అనౌన్స్ చేయడానికి ఇలాంటి క్రేజీ టైమ్‌ను ఎవ్వరూ వదులుకోరు. అజయ్ దేవగన్ అండ్ టీమ్ కూడా వదులుకోలేదు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు. 1950–1963 టైమ్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కి కోచ్, మేనేజర్‌గా సయ్యద్ సేవలు అందించారు. 1956 మెల్బోర్న్ ఒలిపింక్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ సెమీ ఫైనల్స్‌కు, 1962 ఆసియన్ గేమ్స్‌లో టీమ్ గోల్డ్ మెడల్ సాధించడంలో సయ్యద్ పాత్ర ప్రముఖమైనది. సయ్యద్ బయోపిక్‌లో అజయ్ నటించనున్నారు. అమిత్ శర్మ దర్శకుడు. మరోవైపు రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త చాణక్య బయోపిక్‌లోనూ నటించడానికి అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ బయోపిక్స్‌లో నటించడానికి అజయ్ దేవగన్ అంగీకరించడం విశేషం. -
రెచ్చిపోయిన కీచకులు...
బాలికపై లైంగికదాడి: ముగ్గురి అరెస్టు కీచకులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి అభం...శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం... యాకుత్‌పురా: బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భవానీనగర్ ఠాణాలో సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్‌రావుతో కలిసి తెలిపిన వివరాలు ప్రకారం... తలాబ్‌కట్టా రోడ్డు-3లో నివాసం ఉండే ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. భార్య మృతి చెందగా... కుమారుడు, కుమార్తె (16)తో కలిసి ఉంటున్నాడు. ఇతని కుమార్తెపై ఇదే ప్రాంతంలో ఉండే వివాహితుడు సయ్యద్ అబ్దుల్ (26)తో పాటు షేక్ యూనుస్ (26), మహ్మద్ ఫిర్దోస్ హుస్సేన్ (25) కన్నేశారు. తండ్రి, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒక్కర్తే ఉన్న బాలికపై గతేడాది నవంబర్ నుంచి ముగ్గురూ పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈనెల 4న బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా గర్భం దాల్చినట్టు తేలింది. బాలికను నిలదీయగా అబ్దుల్, యూనుస్, ఫిర్దోస్ తనను భయపెట్టి ఈ ఘోరానికి ఒడిగట్టారని చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 డీ , సెక్షన్ 6 ఆఫ్ పోస్కో యాక్ట్ 2012 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. విద్యార్థినిపై అఘాయిత్యం.. జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లైంగిదాడికి యత్నం... అమీర్‌పేట: బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ నగేష్ కథనం ప్రకారం... కుత్బుల్లాపూ ర్ గాజులరామారం కైసర్‌నగర్‌లో బాలిక (14) తన అమ్మమ్మతో కలిసి ఉంటోంది. చిన్నప్పుడే బాలిక తండ్రి చనిపోగా.. తల్లి దుబాయ్‌లో ఉంటోంది. కాగా, రెండు నెలల క్రితం బాలిక తన అమ్మమ్మతో కలిసి బోరబండ బాబాసైలానీనగర్లో బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది. వివాహం అయ్యాక అమ్మమ్మ తన ఇంటికి వెళ్లిపోగా.. బాలిక బంధువు ల ఇంట్లోనే ఉంది. ఇదిలా ఉండగా... మార్చి 3వ తేదీ రాత్రి 2 గంటలకు పెళ్లికొడుకు అన్న కుదూస్ బాలికను నిద్రలేపాడు. సెల్‌ఫోన్ లో గేమ్స్ పెట్టి ఇచ్చాడు. బాలిక గేమ్స్ చూస్తుండగా ఆమెతో అసభ్యం గా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని బెదిరించాడు. స్థానికుల సహాయంతో అమ్మమ్మ వద్దకు చేరుకున్న బాలిక జరిగిన విషయం చెప్పింది. ఆదివారం రాత్రి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కుదూస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.