వైమానిక దాడులు..49 మంది మృతి
డెమాస్కస్: సిరియాలో మరోసారి దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం పేరిట అక్కడి సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రిఖే, జనుదియేహ్ అనే ప్రాంతంలో ప్రభుత్వ బలగాలకు, జిహాదిస్టులకు మధ్య పోరు జరుగుతోందని, ఈ క్రమంలో పలు విమానాల ద్వారా ప్రభుత్వం దాడులు నిర్వహించగా సామాన్యులే ఎక్కువగా బలయ్యారని సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది.