ముషార్రఫ్ తల తెస్తే 200 కోట్లు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ను హతమారిస్తే రూ.200 కోట్లు, 200 ఎకరాలు నజరానాగా ఇస్తానని జమ్హూరీ వతన్ పార్టీ అధ్యక్షుడు తలాల్ అక్బర్ బగ్టి ప్రకటించారు. గతంలో రూ. 100 కోట్లు, 100 ఎకరాలు అని ఆయన ప్రకటించిన నజరానాను ప్రస్తుతం రెట్టింపు చేస్తున్నట్లు రావల్పిండిలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత ఇంట్లో మంగళవారం వెల్లడించారు. ముషార్రఫ్ పరిపాలన కాలంలో తలాల్ తండ్రి అక్బర్ ఖాన్ 2006లో హత్యకు గురయ్యారు.