అవకాశాల వేటలో నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలోని చాలా మంది నిపుణులు వారు చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నా, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఈ విషయం లింక్డ్ఇన్ నిర్వహించిన ‘టాలెంట్ ట్రెండ్స్ ఇండియా’ నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. దాదాపు 55 శాతం మంది నిపుణులు మంచి అవకాశాల కోసం ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. దాదాపు 95 శాతం మంది నిపుణులు ఇంటర్య్వులకు హాజరైన తర్వాత... కంపెనీలు వారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలని ఆశిస్తున్నారు.
కాగా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అనుభవం ఆ వ్యక్తిని ఉద్యోగంలోకి చేర్చుకోవడమా? లేదా? అనే అంశాన్ని ప్రభావితం చేస్తుందని లింక్డ్ఇన్ ఇండియా ైడె రెక్టర్ ఇర్ఫాన్ అబ్దుల్లా తెలిపారు. పరిహారం, వేతనం, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అంశాలే చివరకు ఉద్యోగ ఎంపికలో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.