‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల
తమిళసినిమా(చెన్నై):
దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి–2‘ చిత్రానికి సంబంధించి తమిళ ఆడియో ఆదివారం చెన్నైలో విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదల కాబోతుంది.
చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కోలీవుడ్ ప్రముఖులు కలైపులి థాను, కేఆర్, నటుడు ధనుష్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఆర్కే సురేష్, నటుడు రాంకీ, నిరోషా దంపతులు పాల్గొన్నారు.