tarkey
-
ఆమిర్‌ఖాన్ తీరుపై కంగనా ఆగ్రహం
ఆమిర్ ఖాన్ తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లిన ఆయన అక్కడి ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను కలిసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్, టర్కీ ప్రథమ మహిళనను కలవడంపై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారతదేశంలో స్టార్ నటుడిగా పేరుగాంచిన ఆమిర్ ఇలా చేసి ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సైతం ఆమిర్ ఖాన్ తీరును ఎండగట్టారు. ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం అని, దీనిపై ఆమిర్ వెంటనే స్పందించాలని కోరారు. ఓ ఐకాన్‌లా దేశంలో ఎన్నో మన్ననలు అందుకున్నఅమిర్‌ఖాన్ ఇప్పుడు కపటదారిలా మారారంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయని, అతని చర్యలు చాలామందిని బాధపెడుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. (‘టర్కిలో అతిపెద్ద సూపర్ స్టార్’) కాగా కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. టామ్‌హాంక్స్ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమా 2021 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. షూటింగ్ నిమిత్తం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లారు. ఈ క్రమంలో టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను ఇస్తాంబుల్‌లోని హుబెర్ మాన్షన్‌లో కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎమిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ఆ దేశ ప్రధానితో మాట్లాడటం ఏంటని ఆమిర్‌ఖాన్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్ ఖాన్.. నెటిజన్ల ఫైర్) Hmmm this is definitely worrying on many levels, for India @aamir_khan isn’t just an actor he participates and involves himslef with this nation on many levels,he is a very big icon, he is coming across as a hypocrite now he must explain his actions because many are hurt 🙏 https://t.co/Grta2Cm8EZ — Kangana Ranaut (@KanganaTeam) August 17, 2020 -
హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై : ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుం వైరల్ అవుతోంది. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో 'మదగజరాజా', 'ఆంబల' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఫైట్ సీన్లను ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. గతంలోనూ ’తుప్పరివాలన్’ సినిమా షూటింగ్‌లోనూ ఈ యువహీరో గాయపడిన విషయం తెలిసిందే. ఇక విశాల్ ‘అయోగ్య’ చిత్రం మే 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, ఆయన జోడీగా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినా చివరికి మే నెలకు వాయిదా పడింది. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. -
బ్రిటన్ పర్యటనకు ముందే మోదీకి చుక్కెదురు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్ పర్యటనకు ముందే చుక్కెదురు అయింది. ఆయన పర్యటనను బ్రిటన్ ఇండో అసోసియేషన్ అయిన ఆవాజ్ యూకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోదీ రావొద్దంటూ యూకే పార్లమెంట్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసింది. మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చిరించటమే కాకుండా, ఆయనను హిట్లర్‌తో పోల్చుతూ ఏర్పాటు చేసిన ఫెక్సీని అధికారులు తొలగించారు. అయితే ఆవాజ్ యూకే మాత్రం తన ఆవేదన, ఆక్రోశాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ... 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు మోదీనే కారణమని మండిపడింది. కాగా ఈ నెల 12 నుంచి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 12వ తేదీ నుంచి 16వరకూ బ్రిటన్, టర్కీలో పర్యటిస్తారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. కాగా మోదీ తొలిసారిగా బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తో లంచ్, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.