‘బోనాలు’ ఇతివృత్తంగా తెలంగాణ శకటం
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల శకటాలు రూపొందుతున్నాయి. బోనాల పండుగ ఇతివృత్తంతో తెలంగాణ, సంక్రాంతి పండుగ ఇతివృత్తంతో ఏపీ శకటాలు రూపొందిస్తున్నారు. బోనాల ఉత్సవం ప్రారంభమయ్యే గోల్కొండ కోట నేపథ్యంగా బోనాలు తలపై ధరించిన మహిళలు, మెడలో నిమ్మకాయలు, పూలు, పూసల దండలు ధరించి కొరడాతో కొట్టుకునే పోతురాజు, వేపచెట్టుకింద ఎల్లమ్మ దేవత, వేపమండలు పట్టుకున్న మహిళలు, జోస్యం చెప్పే మహిళలు, తొట్టెలతో తెలంగాణ శకటాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగను పెద్దఎత్తున జరుపుకొంటారు.