మత్తయ్య పిటిషన్పై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తనపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.