యూపీ మతఘర్షణల్లో టీవీ జర్నలిస్ట్ తోపాటు ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చెలరేగిన అల్లర్లలో స్థానిక టెలివిజన్ రిపోర్టర్ తోపాటు మరో ఆరుగురు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మతపరమైన అల్లర్లలో మరో 32 మందికి గాయాలైనట్టు ఐజీ ఆర్ కే విశ్వకర్మ తెలిపారు.
అత్యాచార ఆరోపణలపై ఓ వ్యక్తి ఆగస్టు 27 తేదిన హత్యకు గురికావడంతో ఇరువర్దాల మధ్య అల్లర్లు చెలరేగాయి. అంతేకాక స్థానికుల్లో ఇద్దర్ని నరికి చంపడంతో మత ఘర్షణలు ఇతర ప్రాంతాలకు పాకాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.