దక్షిణ కొరియాలో ఘనంగా దసరా వేడుకలు
సియోల్: దక్షిణ కొరియాలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సియోల్ నగరంలోని సుంగ్కీంక్వాన్ విశ్వవిద్యాలయం(ఎస్కేకేయూ)లో దక్షిణ కొరియా తెలుగు సంఘం(టాస్క్) 15వ వార్షికోత్సవంతో పాటు, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరయ్యారు. పూజ కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకలు.. క్లాసికల్ డ్యాన్స్, పిల్లల ఫ్యాషన్ షో, కామెడీ స్కిట్స్, ఆట పాటలతో వినోదభరితంగా సాగాయి. మహిళలు అందరు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమాన్ని టాస్క్ కమిటీ మెంబర్లు డా. వేణు నూలు, డా. సుశ్రుత కొప్పుల, తరుణ్ కుమార్, డా. అనిల్ కావాలా, అంకంరెడ్డి హరినారాయణ, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంసత్ కుమార్, చంద్రకళలు ఘనంగా నిర్వహించారు. కొప్పల్లి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.