దుర్గమ్మ సేవలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఏపీ రైతు బజార్ సీఈవో ఎం.కె.సింగ్ కూడా కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలి కారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మను దర్శించుకు న్నారు. వారిని వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ‘అంతా అక్కడే జరిగింది’ బృందం
ఈ నెల 14న విడుదల కానున్న ‘అంతా అక్కడే జరిగింది’ సినిమా నటీనటులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్ర హీరో శరవన్, దర్శకుడు సతీష్‌తో పాటు నిర్మాత ఆదినారాయణ తదితరులు సినిమా హార్డ్ డిస్క్‌ను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. సినిమా ఘనవిజయం సాధించాలని అమ్మవారిని కోరామని చిత్ర యూనిట్ పేర్కొంది.