బెంగాల్లో పదేళ్ల బాలికపై అత్యాచారం
పెళ్లికి వెళ్లి తిరిగొస్తున్న పదేళ్ల బాలికపై పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కూలీ కుమార్తె అయిన బాధితురాలు తన నాయనమ్మ ఊళ్లో పెళ్లి జరుగుతుండటంతో అక్కడకి వెళ్లి, తిరిగి ఒంటరిగా వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందని అదనపు ఎస్పీ అభిషేక్ మోడీ తెలిపారు.
స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను గ్రామస్థులు గమనించి, వెంటనే బుల్బుచాడీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మోడీ చెప్పారు.