టెన్నిస్ విజేతలు శశాంక్, జ్ఞానిత
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా టెన్నిస్ సంఘం, ఎన్టీఆర్ స్డేడియం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో చింతా శశాంక్ (విశాఖ) విజేతగా నిలువగా, బాలికల విభాగంలో ఎ.జ్ఞానిత (విశాఖ) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో లేళ్ల ఆశ్రిత (గుంటూరు), బాలుర విభాగంలో కిషన్ కుమార్ (చెన్నై) రన్నరప్ టైటిల్ సాధించారు. బాలుర డబుల్స్ విభాగంలో వరుణ్ కుమార్, కిషన్ కుమార్ జంట (చెన్నై) విజేతలుగా నిలిచారు. గిరిష్, అనంతమణి జంట (విశాఖ) రన్నరప్‌గా నిలిచారు. బాలికల డబుల్స్ విభాగంలో శరణ్య, సాత్విక జంట (విశాఖ) విజేతలుగా నిలిచారు. లేళ్ల ఆశ్రిత, ప్రవల్లిక జంట (గుంటూరు) రన్నరప్‌గా నిలిచారు. అనంతరం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ స్డేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు విజేతలకు ట్రోఫీలు అందించారు.