పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని తిరిగి రాలేదు. ఈ సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గురువారం ఎస్సై వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.... భవానీనగర్ నషేమాన్నగర్ ప్రాంతానికి చెందిన ఆయేషా బేగం, ఇక్బాల్ ఖాన్ దంపతుల కూతురు సబా ఫాతిమా (16) విద్యార్థిని. కాగా, ఈ నెల 8వ తేదీన సాయంత్రం సబా ఫాతిమా ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తన కూతురు కనిపించడం లేదని ఆయేషా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854798, 8333900133 నంబర్లలో సమాచారం అందించాలన్నారు.