లండన్లో ఉగ్రదాడి, మహిళ మృతి
లండన్లోని రసెల్ స్క్వేర్లో బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది. కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తి ఒక మహిళను చంపడంతో పాటు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాడు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో.. వెంటనే పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అరెస్టుచేశారు.
దాడిలో ఆరుగురు గాయపడిన విషయాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు నిర్ధారించారు. మరో మహిళకు ఘటనా స్థలంలోనే చికిత్స అందించినా, కాసేపటి తర్వాత ఆమె మరణించారు. ఇది బహుశా ఉగ్రదాడి లాంటిదే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకోడానికి ఓ అధికారి స్టన్ గన్ ఉపయోగించాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియలేదు.