Thanda residents
-
కామారెడ్డి: ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్ఆర్ ప్రవేట్ చేతుల్లోకి.. -
తాండాలో మంటల మిస్టరీ...
-
గ్రామంలో 150 మంది పోలీసులతో తనిఖీలు
పెద్దవూర(నల్లగొండ): పారెస్ట్ ఆఫీస్‌పై తండా వాసులు దాడి చేయడంతో పోలీసులు ఆ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం మెట్టలతండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు..మెట్టలతండా వాసులు అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే రాళ్లను రెండు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తుండగా బుధవారం సాయంత్రం అధికారులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సహాయంతో ఆ ట్రాక్టర్లును స్వాధీనం చేసుకొని ఒక ట్రాక్టరును పారెస్ట్ ఆఫీస్‌లో మరోక దానిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ నేపధ్యంలో తండావాసులు బుధవారం రాత్రి అధికారులు వేధిస్తున్నారన్న నేపంతో పారెస్ట్ఆఫీస్పై దాడి చేసి ట్రాక్టరును తరలించుకొని వెళ్లారు. దీంతో,విషయం తెలిసిన పోలీసులు 150మంది సభ్యులతో వెళ్లి గురువారం తెల్లవారుజామున గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారెస్ట్ ఆఫీస్‌పై దాడి చేసిన వారిని గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.