కత్తులతో బెదిరించి దోపిడీ
ఒంగోలు క్రైం : ఒంగోలు నగరంలో శనివారం వేకువజామున దోపిడీ జరిగింది. పేర్నమిట్టకు తీసుకెళ్తామని చెప్పి మహిళను ఆటోలో ఎక్కించుకున్న ఆటో వాలా.. మరో ఇద్దరి సా యంతో దోపిడీకి పాల్పడ్డాడు. ఒం గోలు ఉత్తరబైపాస్లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నల్లపరాజు వరలక్ష్మి ఒంగోలు శివారు పేర్నమిట్టలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం అర్ధరాత్రి ఒంగో లు రైల్వేస్టేషన్లో దిగింది. అక్కడి నుంచి బస్టాండ్‌కు చేరుకుంది. శని వారం వేకువజామున బయటకు వ చ్చి ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఆటో రాగా ఎక్కింది. అప్పటికే ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆటోను డ్రైవర్ బస్టాండ్ ముందుగా తీసుకెళ్లి డిపో ఇన్‌గేట్ ఎదురుగా యూ టర్న్ తీసుకున్నాడు. ఇటెక్కడికి అని వరలక్ష్మి అడగబోయేసరికి ఆటోలో ఉన్న ఇద్దరూ ఆమెను కత్తులతో బెదిరిం చారు. ఆటోను పాత గుంటూరు రో డ్డు మీదుగా ఉత్తర బైపాస్కు తీసుకెళ్లారు. అక్కడ నిర్జన ప్రదేశంలో ఆపి ఆ మె చెవి కమ్మలు, బంగారు చైను, సెల్ ఫోన్, రూ.300 లాక్కున్నారు. ఆమెను అక్కడే వదిలేసి ముగ్గురూ ఆటోలో వె ళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆ మె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.