కరీంనగర్లో దొంగల ముఠా అరెస్ట్
కరీంనగర్ : నగరంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు దాడి చేసి హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద దొంగలను పట్టుకున్నారు. వీరి నుంచి మూడు బైక్‌లు, 8 సెల్ఫోన్లు, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో జరిగిన నాలుగు దొంగతనం కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన సాయి, వేణు, కార్తీక్, రాజేష్, హరీష్, సాయి చందు, శ్రావణ్ కుమార్, భువనేశ్వర్‌గా గుర్తించారు. నగరంలో చంటిపిల్లలతో దంపతుల మాదిరిగా అంతర్రాష్ట్ర ముఠా తిరుగుతోందని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.