తిరుమలగిరిలో తిరంగా యాత్ర
తిరుమలగిరి
తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక చౌరస్తాలో మాట్లాడారు. 2001 నుంచి 2014 వరకు సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి అధికారంలోకి రాగానే నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు. గత 32రోజులుగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2019 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువల ద్వారా 5టీఎంసీల నీటిని విడుదల చేసి ఈప్రాంతంలోని చెరువులను కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గొంగిడి మనోహర్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు కె. సోమయ్య, గౌరు శ్రీనివాస్, జీడి బిక్షం, దిన్‌దయాల్, డి. వెంకన్న, జయచందర్, రవి, శుభాష్‌రెడ్డి, యాదగిరి, వరుణ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.