తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..
బెంగళూరు: తనను ఇష్టపడటం లేదనే అక్కసుతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తాను ప్రేమిస్తున్న మహిళ పిల్లలను హతమార్చాడు. ముగ్గురు పిల్లలను మ్యాన్ హోల్లో వేయడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు కూడా నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలే. వీరిలో ఇద్దరు బాలురు కాగా, ఒకరు బాలిక. ఈ ఘటన ఆగస్టు 27న చోటుచేసుకోగా తాజాగా కొలిక్కి వచ్చంది. పోలీసులు వివరాల ప్రకారం నజీమా బేగం అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఆమె గత కొంతకాలంగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. ఆమెను ఫయూం బేగ్ అనే వ్యక్తి ఇష్టపడటం మొదలుపెట్టాడు. కానీ, ఆమె మాత్రం మరో వ్యక్తిని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఫయూం.. నజీమాపై కక్ష భూని ఆమె పిల్లలను మ్యాన్ హోల్లో వేశాడు. అందులోని మురుగు ప్రవాహానికి వారు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు సాయంత్రం నజీమా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఛేదించారు. నజీమాకు ఫయీం బేగ్ బంధువే.