అభినందనలు.. ధన్యవాదాలు
సాక్షి దినపత్రికలో నాలుగో పేజీలో ప్రచురించే త్రికాలమ్ నాకు ఎంతో ఇష్టమైన శీర్షిక. 26-4-2015 సంచికలో అన్నదాతను ఆదుకోరా! అన్న శీర్షికతో వెలువడిన రచన ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రులనూ అభ్యర్థిస్తూ చేసిన విన్నపంలా నాకు అనిపిం చింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో మొదటిది సేవారంగం కాగా, రెండోది పారిశ్రామిక రంగం, మూడో స్థానంలో వ్యవసాయం ఉన్నాయి. అయినా రైతులు దేశంలో దుర్భర స్థితిలో ఉన్నారు. రాజధాని ఢిల్లీలో జరిగిన గజేంద్రసింగ్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. అలాగే ఒక రాష్ట్రంలో 67 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా దారుణ పరి ణామం.
మన నేతలు స్మార్ట్ సిటీలకీ, స్మార్ట్ విలేజ్లకీ ఇచ్చే ప్రాధాన్యం రైతులకు ఇస్తే వారి ఆత్మహత్యలు ఆగుతాయి. రైతు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వా లన్నీ ఈ ఆత్మహత్యలను నివారించాలి. అది వారి బాధ్యత, నైతిక విధి. పదకొండవ పేజీ లో ప్రచురించిన ‘ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు’ ఆ సంచికకే పరిపూర్ణతను తెచ్చింది. కె.ఆర్. వేణుగోపాల్ అభిప్రాయాలు అందులో చదివాం. అంతర్జాతీయ విధివిధానాలు రూపొందించిన వేణుగోపాల్ ఐసీడీఎస్ వంటి చిన్న పథకం చేపట్టడం ఏమిటని మొదట అనుకున్నాం. కానీ ఆయన పుస్తకం వచ్చిన తరువాత ఆ పథకం లోతుపాతులు ఎంతటివో తెలిశాయి. శాసన, చట్ట, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడిం టినీ ఆయన అపారంగా గౌరవించారు. ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావిస్తాను. వేణుగోపా ల్ ఒక పని మీద సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లారు. సొంతపని. అయినా అందరికి ఉండే పద్ధ తి ప్రకారమే క్యూలో నిలబడి ఆఫీసర్‌ను గౌరవంగా సంబోధించారు. అదీ ఆయన సం స్కారం. ఇలాంటి మహోన్నతుడి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు సాక్షికి ధన్యవాదాలు.
- నీలయ్య జ్యోతి హైదరాబాద్