పిడుగుపాటుకు మహిళ బలి
పోలవరం : మండలంలోని పాత పట్టిసీమకు చెందిన రెడ్డి సుబ్బలక్ష్మి (42) అనే మహిళ శనివారం సాయంత్రం పిడుగుపాటుకు మృతిచెందింది. ఉదయం కామాయమ్మ చెరువు ప్రాంతంలో పనులకు ఈమె పలువురు మహిళలతో కలిసి కూలికి వెళ్లింది. సాయంత్రం ఆరుగురు మహిళలు కలసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. ఆరుగురు మహిళల్లో చివరన నడుస్తున్న సుబ్బలక్ష్మిపై పిడుగు పడింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులున్నారు.