బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ సుమతి హెచ్చరిక
సంగారెడ్డి క్రైం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బడుగుల సుమతి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఫోన్ తదితర సాధనాలు ఉపయోంచినా, లేదా నేరుగా బెట్టింగులకు పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, బెట్టింగులకు పాల్పడేవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.బెట్టింగ్‌ల సమాచారాన్ని ఎవరైనా తమకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
ముఖ్యంగా యువత బెట్టింగ్‌లకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బుకీలు, నిర్వాహకులు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.