తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్తున్నారా..?
దర్శనానికి వెళ్తున్నారా..? అయితే మీరు ముందుగానే మీ ఇంటి నుంచే దర్శనం టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం ముందుగా మీరేం చేయాలి..?, ఎన్ని రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి మరి...
రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా...
http://www.ttdsevaonline.com/Home.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సైన్అప్ ఆప్షన్ వస్తుంది.
యూజర్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు అందించాల్సి ఉంటుంది. 20 కేబీ పరిమాణానికి మించని ఫొటోతోపాటుగా, మీకు సంబంధించిన ఐడీ ఫ్రూప్ ఇవ్వాలి. మీ మెయిల్ ఐడీ ఇచ్చి దానికి ఎనిమిది అక్షరాలుగల పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి.
అన్ని పూర్తయ్యాక మీరు ఇచ్చిన మెయిల్‌కు రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే టీటీడీ సేవా ఆన్లైన్లో రిజిష్టర్ అయినట్టే.
టికెట్ పొందండిలా...
॥ టీటీడీ సైట్లో లాగిన్ అయ్యాక మీరు పలు దశల్లో టికెట్
పొందవచ్చు.
॥ పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ (భక్తుల సమాచారం), పేమెంట్,
కన్ఫర్మేషన్(ధ్రువీకరణ) అంశాలు పూర్తి చేయాలి.
పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్
ఎంతమంది భక్తులు వెళ్తున్నారో అంతమంది ఫొటోలతోపాటుగా ఐడీ ప్రూఫ్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
టికెట్ రిజర్వు ఇలా
ఇక్కడ మీకు నచ్చిన తేదీ, సమయాన్ని
ఎంచుకోవచ్చు. దర్శనానికి ఎన్ని టికెట్లు కావాలో సెలక్ట్ చేసుకోవాలి. ప్రతి గంటకు స్లాట్లు
అందుబాటులో ఉంటాయి. విండోలో కుడివైపు గ్రీన్ కలర్లో ఉన్న ‘చెక్ ఎవైలబిలిటీ’ ఆప్షన్‌తో
అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఇతర సేవలు ఆన్లైన్లో...
టీటీడీ సైట్లో ఒకసారి రిజిష్టరైతే ఈ-దర్శన్ మాత్రమే కాకుండా ఇతర సేవలు, ఈ-వసతి, ఈ-సుదర్శనమ్, ఈ-డొనేషన్ తదితర అంశాలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ-స్పెషల్
ఎంట్రీ దర్శన్ తప్ప ఇతర సేవలకు 60 రోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
సూచనలు : టికెట్ బుకింగ్ సైట్ రోజూ రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.15 వరకు పనిచేయదు.
ఈ-దర్శన్ కోటాను రోజూ ఉదయం 9 గంటలకు మాత్రమే విడుదల చేస్తారు. టికెట్లను రెండు ప్రింట్లు
తీసుకోవాలి. ఒకటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అందించాలి. రెండోది దర్శనం క్యూలో ఇవ్వాలి.
ఒకసారి బుక్ చేశాక ఇక అది రద్దుకాదు. ప్రత్యేక పరిస్థితుల్లో మీ దర్శన సమయాన్ని మార్పు చేసే
అధికారం టీటీడీకి ఉంది. ఏ ఫొటో ఐడీ సమర్పించారో దాన్నే దర్శనం సమయంలో చూపించాలి.