కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జుల నియామకం
తిరుపతి మంగళం : కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన పరిశీలకుల్లో జిల్లాకు చెందిన నలుగురికి చోటు దక్కింది. తిరుపతి కార్పొరేషన్‌కు సంబంధించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గుంటూరుకు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైజాగ్‌కు నియమించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వీరు పార్టీ గెలుపునకు కృషి చేస్తారు. తిరుపతికి పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి నియామకంపై పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.