పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 68, 853 మంది విద్యార్థులు ∙
పరీక్షల అధికారులకు విద్యాశాఖ మార్గదర్శకాలు
రాయవరం (మండపేట) :
పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందించింది. ఈ ఏడాది తొలిసారిగా సీసీఈ విధానంలో పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 15 నిమిషాల సమయాన్ని పరీక్ష పేపరు చదువుకునేందుకు కేటాయిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్ష జరుగుతుంది.
చీఫ్, డీవోల విధులు
పరీక్షా కేంద్రాన్ని ముందుగా సందర్శించి ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించాలి. తహసీల్దారు, ఎస్పీహెచ్వోలకు పరీక్షల విషయం తెలిపాలి. వారి ఫో¯ŒS నంబర్లు తీసుకోవాలి.
పరీక్షల నిర్వహణకు అన్ని ఫారాలు సిద్ధం చేసుకోవాలి. డి–ఫారం, ఓఎంఆర్ షీట్స్, పేపర్ సీల్, అటెండె¯Œ్స షీట్స్ సరిపడా అందాయో లేదో చూసుకోవాలి. ట్రంక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటింజె¯Œ్స సామగ్రి సిద్ధం చేసుకోవాలి.
సిబ్బంది నుంచి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేష¯Œ్స సర్టిఫికెట్స్ తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బాలికలను చెక్ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.
పరీక్ష జరుగుతున్న రోజుల్లో..
రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్
కాన్ఫెరె¯Œ్సకు హాజరు కావాలి. నిర్దేశించిన సమయానికన్నా ముందు సీఎస్, డీవో ఇద్దరు సంతకాలతో పరీక్షల కట్టల సీల్ తెరవాలి.
లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్లకు
తరగతి గదులు కేటాయించాలి.
ఇన్విజిలేటర్లకు సూచనలు
ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబి
నేష¯ŒS గురించి విధిగా తెలుసుకోవాలి.
పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. తొమ్మిది గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు.
ప్రతి విద్యార్థిని సోదా చేసి ఎటువంటి ఫర్‌బిడె¯ŒS మెటీరియల్ లేదని నిర్దారించుకోవాలి. విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్‌టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండె¯Œ్స షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్దారించుకోవాలి.
అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి. అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి.
ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలు విద్యార్థులకు వివరించాలి. ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు. ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లి, నా¯ŒS స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి.
గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌ను ఎర్ర సిరా పె¯ŒSతో క్యాన్సిల్ చేయాలి. సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ సరిచూసుకోవాలి.