ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం
నేడు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
పక్కాగా ఏర్పాట్లు
కాకినాడ క్రైం :
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రం లోపలికి అనుమతించబోమన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 37 క్యాంపస్‌లలో 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు శనివారం ఆయన తెలిపారు. ఈ పరీక్షకు 33,964 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కాకినాడలో 31 క్యాంపస్‌ల్లోని 45 కేంద్రాల్లో 19,600 మంది, రామచంద్రపురంలో రెండు క్యాంపస్‌ల్లోని రెండు సెంటర్లలో 1,859 మంది, పెద్దాపురంలోని 4 క్యాంపస్‌ల్లోని 13 సెంటర్లలో 12, 505 అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు. çహాల్ టికెట్లు ఇప్పటికే ఆ¯ŒSలైన్లో అభ్యర్థులందరూ తీసుకున్నారని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభ సమయాని కంటే ఒక గంట ముందు 9 గంటలకు విధిగా పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్‌తో హాజరు కావాలని సూచించారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, వాచీలు, పె¯ŒSడ్రైవ్‌లు తదితర వస్తువులను లోనికి అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం జేఎ¯ŒSటీయూకే కన్వీనర్‌ను సంప్రదించాలని సూచించారు.
కానిస్టేబుల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం నిర్వహించే పరీక్షకు రాజమహేంద్రవరం రీజియ¯ŒS పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రీజినల్ కో–ఆర్డినేటర్, నన్నయ వర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్.రమేష్ తెలిపారు. స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ రీజియ¯ŒS పరిధిలో 20 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9892 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు తొలిసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించి బయోమెట్రిక్ నమోదు చేయించుకున్న తరువాతే పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సమయంలో సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అబ్జర్వర్లను నియమించినట్టు తెలిపారు. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో గుర్తించాలన్నారు. సమావేశంలో సహాయ రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.జ్యోతిర్మయి పాల్గొన్నారు.