టాప్–3 లక్ష్యంగా...
ఆసియా అథ్లెటిక్స్ బరిలోకి భారత్
భువనేశ్వర్: స్వదేశంలో సత్తా చాటుకొని... వచ్చే నెలలో లండన్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ బెర్త్ సంపాదించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్స్ ఆసియా చాంపియన్షిప్లో బరిలోకి దిగనున్నారు. స్థానిక కళింగ స్టేడియంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించగా... ఈవెంట్స్ గురువారం మొదలవుతాయి. ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన వారికి వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. 95 మంది సభ్యుల భారీ బృందంతో ఈ పోటీల్లో ఆడుతున్న భారత్ ఓవరాల్గా పతకాల పట్టికలో టాప్–3లో నిలవాలనే లక్ష్యంతో ఉంది. 44 దేశాల నుంచి 800 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటున్న ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి.