Top 5 billionaires
-
ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే?
Top 5 Youngest Billionaires: ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ఎవరు ఉన్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లెమెంటే డెల్ వెచియో ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో అగ్ర స్థానం పొందిన వ్యక్తి 'క్లెమెంటే డెల్ వెచియో'. ఇతని ఆస్తి 4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ. ఇటాలియన్ బిలియనీర్ లియోనార్డో డెల్ వెచియో కుమారుడు క్లెమెంటే, తండ్రి మరణం తర్వాత వారసత్వంగా 12.5 శాతం వాటాను పొంది.. 18 సంవత్సరాలకే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. కిమ్ జంగ్ యౌన్ సౌత్ కొరియాకు చెందిన 'కిమ్ జంగ్ యౌన్' ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానం పొందిన యువకుడు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారు కూడా. తన తండ్రి కిమ్ జంగ్-జు 2022లో 54 ఏళ్ల వయసులో మరణించిన తరువాత ఇతని ఆస్తి 2.5 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇతని వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. కెవిన్ డేవిడ్ లెమాన్ జర్మనీకి చెందిన కెవిన్ డేవిడ్ లెమాన్ దేశంలోని డ్రగ్‌స్టోర్ చైన్ డీఎమ్ (Drogerie Markt)లో 50 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉన్నాడు. దీని వార్షిక ఆదాయం 14 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. గొయెట్జ్ వెర్నర్ జర్మనీలోని కార్ల్స్రూహ్లో తన మొదటి డిఎమ్ స్టోర్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి 3,700 కంటే ఎక్కువ ప్రదేశాలలో స్టోర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. 1974లో కెవిన్ డేవిడ్ లెమాన్ తండ్రి గెంతెర్ (Guenther) 'డీఎమ్'లో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత 2017లో కెవిన్ డేవిడ్‌కు 50శాతం వాటాను బదిలీ చేశారు. ఇతని ఆస్తి ఫోర్బ్స్ ప్రకారం 1.7 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. కిమ్ జంగ్ మిన్ ఫోర్బ్స్ జాబితా ప్రకారం, కిమ్ జంగ్ మిన్ నాలువ అతి తక్కువ వయసున్న బిలియనీర్. దక్షిణ కొరియాకు చెందిన ఈమె NXCలో సుమారు 31 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ప్రఖ్యాత ఆన్లైన్ గేమింగ్ దిగ్గజం నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారుగా కూడా ఉంది. కిమ్ జంగ్ మిన్ ఆస్తి 1.4 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! లూకా డెల్ వెచియో ఫోర్బ్స్ జాబితాలో ఐదవ యంగెస్ట్ బిలియనీర్ లూకా డెల్ వెచియో. 22 సంవత్సరాల ఇతడు దివంగత లియోనార్డో డెల్ వెచియో ఆరుగురి సంతానంలో ఒకరు. తండ్రి ఆస్తిలో 12.5 శాతం వారసత్వ వాటా రావడం మాత్రమే కాకుండా.. ఇతడు ఎస్సిలర్లుక్సోటికా హోల్డింగ్‌లు, ఇన్సూరెన్స్ జనరల్‌లో షేర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కోవివియోలో కూడా షేర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
కరెన్సీ కింగ్‌లు
120 కోట్ల మంది కోసం ప్రవేశపెట్టే దేశ బడ్జెట్ ప్రపంచంలోని మొదటి నలుగురు కుబేరుల ఆస్తితో దాదాపు సమానం. టాప్ 5 బిలియనీర్ల జాబితా పరిశీలిస్తే.. ( రూ. కోట్లలో) బిల్‌గేట్స్ 5,38,560 అమెరికాకు చెందిన బిల్‌గేట్స్ మెక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. 1995 -2006 మధ్య, 2009లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. కార్లొస్ స్లిమ్ హెలు 5,24,280 మెక్సికోకు చెందిన ఈ టెలికం దిగ్గజం 2010-13 మధ్య ఫోర్బ్స్ ధనవంతుల్లో చోటు దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ ఆఫ్ మెక్సికోగా పేరు పొందారు. వారెన్ బఫెట్ 4,94,360 ప్రపంచంలో విజయవంత మైన పెట్టుబడిదారుల్లో మొదటిస్థానం అమెరికాకు చెందిన బఫెట్దే... బెర్క్‌షైర్ హతవేకు ఈయన ఛైర్మన్, సీఈవోగా ఉన్నారు. అమాన్షియో ఓర్టెగా 4,38,600 స్పెయిన్‌కు చెందిన అమాన్షియో.. ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూపునకు వ్యవస్థాపక ఛైర్మన్.. అక్టోబర్, 2015న ఫోర్బ్స్ బిలియనీర్లలో మొదటిస్థానం దక్కించుకున్నారు. లారీ ఎల్లిసన్ 3,69,240 అమెరికాకు చెందిన ఎల్లిసన్ ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీఓగా ఉన్నారు. ఒరాకిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన సీఈవోగానూ పనిచేశారు.