రైతుల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి
సాక్షి, అమరావతి : రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రైతు సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ శనివారం నిర్వహంచిన రైతు మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షా తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్శిటీ గెస్ట్‌హౌస్‌లో పలు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించేందకు కనీసం వారం, పది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలంటూ భారతీయ కిసా¯ŒS సంఘం ప్రతినిధులు అమిత్‌షాకు వినతిపత్రం అందజేశారు. క్వింటా ధాన్యం పండించడానికి రైతుకు రూ.2 వేలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రూ.1,500 మించి గిట్టుబాటు ధర కల్పించడం లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు లాభదాయకత ఎలా సా««దl్యమో ఆలోచించాలని సంఘ ప్రతినిధులు ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన అమిత్‌షా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రిఫైన్డు పామ్ ఆయిల్ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాన్ని 30 శాతం పెంచి, దేశీయ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ పామ్ రైతులు కోరారు. కొబ్బరి పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పన, ప్రకృతి వ్యవసాయం పోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్లో అదనపు నిధుల కేటాయింపు అంశాలపై ఆయా రైతు సంఘాల ప్రతినిధులు వినతి ప్రతాలు ఇచ్చారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. భారతీయ కిసా¯ŒS సంఘం జాతీయ కార్యదర్శి కుమార్‌స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు వివిధ రైతు సంఘాల ప్రతిని«ధులు అమిత్‌షాను కలిసిన వారిలో ఉన్నారు.
ప్రత్యామ్నాయం చూపాకే నిర్వాసితులను ఖాళీ చేయించాలి
రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షాను పోలవరం నిర్వాసితుల ప్రతినిధుల బృందం కలిసింది. తమకూ పెరిగిన రేట్ల ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చింది. ఇటీవల కాలువ నిర్మాణంలో భూములు పోయిన వారికి ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం అందజేశారని, తమకు గతంలో ఎకరాకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షల పరిహారం అందిందని గుర్తు చేశారు. తమకూ ఆర్ఆర్ ప్యాకేజీని అందజేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చూపిన తర్వాతే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల తరుపున పోరాడుతున్న వనవాసి కల్యాణ ఆశ్రమం జాతీయ కన్వీనర్ గిరీష్ కుజార్, రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్రి నాయకత్వంలో 20 మంది నిర్వాసితులు అమిత్‌షాను కలిశారు.