సెక్స్‌రాకెట్‌లో దొరికిపోయిన బ్యూటీ క్వీన్
వియత్నాం: ఆమె ఓ అందమైన యువతి. విశ్వవిద్యాలయంలో గొప్ప విద్యనభ్యసించింది. అదొక్కటే కాదు స్థానికంగా జరిగిన అందమైన యువతుల పోటీల్లో తొలి రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఆ గతాన్ని మరుగునపడేసేంత చెత్త పనిచేసింది. సెక్స్‌రాకెట్‌లో పోలీసులకు దొరికిపోయింది. ఆమె మరో యువతి కలిసి ఓ హోటల్లో మరో ఇద్దరు విఠులతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఇప్పుడు కటకటాలపాలయింది. వివరాల్లోకి వెళితే..
తారన్ డక్ థై లియాన్ అనే యువతి 2014 తాను చదువుతున్న యూనివర్సిటీలో నిర్వహించి బ్యూటీ క్వీన్ కాంటెస్ట్‌లో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఇటీవల ఆమె తన అనుచరురాలు డోవాన్ ఎన్‌గోక్ మిన్హా(26) కలిసి వియత్నాంలోని క్వాంగ్ నిన్స్ ప్రావిన్స్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో లియాన్‌కు మూడున్నర జైలు శిక్ష పడగా.. ఆమె అనుచరురాలుకి రెండు సంవత్సరాల మూడు నెలల శిక్షపడింది. అంతేకాదు, వీరు 2,900 డాలర్ల మొత్తాన్ని కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది.