భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
హైదరాబాద్: నగరంలోని చంపాపేట్‌లో ఓ భార్య తన భర్త ఇంటి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగింది. స్థానిక మారుతీనగర్‌లో నివాసముంటున్న ట్రాన్స్‌కో ఏడీ వెంకటేశ్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆయన భార్య మల్లేశ్వరి ఆరోపిస్తోంది. ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఇంట్లోని వారంతా తాళం వేసి వెళ్లిపోయారు.