రోగాల నివారణలో ముందుండాలి
కాజీపేట : నానో మెడిసిన్, నానో టెక్నాలజీలను ఉపయోగించి ధీర్ఘకాలిక రోగాలను నయం చేసేందుకు ఉన్న అవకాశాలపై విద్యార్థులు మ రింతగా శాస్త్రీయ ధృక్పథంతో పరిశోధనలు చేయాలని ప్రతిషా్ఠత్మక నిప్ప ర్ ప్రొఫెసర్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమిడి శివారులోని నేతా జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్ కళాశాలలో ఆదివారం ‘ఫార్మారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కా ర మార్గాలు’ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రయోగాలపై పట్టు ను సాధించి నూతన ఔషదాలను తయారు చేసేందుకు మరింతగా పరిశోదనలు చేయాలని సూచించారు. దీంతో ఫార్మా రంగానికి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయన్నారు. కళాశాల సెక్రటరీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో కళాశాల విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిపుణులైన విద్యావేత్తలతో మరిన్ని అవగాహన సదస్సులు ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్న ట్లు ప్రకటించారు. చంద్రయ్యను విద్యారు ్థలు, కళాశాల యాజమాన్యం సన్మానించింది.