లేబర్ ఆఫీసర్ మృతిపై ఆందోళన
మల్కాపురం(ఏలూరు రూరల్) : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చోడెం చిన్నదుర్గారావు(50) మల్కాపురం ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఏలూరులో కార్మికశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న దుర్గారావు నవంబర్ 1న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయనను ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిరోజులు చికిత్స అందించిన వైద్యులు గురువారం ఉదయం కాలుకు ఆపరేష¯ŒS చేసేందుకు సమాయత్తమయ్యారు. ఉదయం ఆయనను ఆపరేష¯ŒS గదిలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే వైద్య సిబ్బంది బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో పలు పత్రాలపై సంతకాలు చేయాలని కోరారు. దీనిపై కుటుంబీకులు ఆరా తీయగా.. పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. అనంతరం కొద్దిగంటలకు దుర్గారావు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
మత్తుమందు వికటించిందని అనుమానం
వైద్యుల తీరుపై చిన్నదుర్గారావు భార్య ఎస్తేరురాణి, కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. కాలుకు ఆపరేష¯ŒS చేస్తే మనిషి చనిపోవడం ఏమిటని ప్రశ్నించారు. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న కార్మిక సంఘం నాయకులు యు.వెంకటేశ్వరరావు(యువీ)తోపాటు పలువురు ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడం వల్లే దుర్గారావు మృతి చెందాడని అనుమానం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోగి కేస్ షీట్తోపాటు ఆపరేష¯ŒSకు సంబంధించిన సీసీ ఫుటేజీ అందజేసి విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన వైద్యులు కేసు క్లిష్టంగా ఉందని కుటుంబీకులకు ముందే చెప్పి వారి అనుమతితోనే ఆపరేష¯ŒS నిర్వహించామని పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.