TTD diaries
-
2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు వచ్చేశాయ్.. దక్కించుకోండి ఇలా..
తిరుమల: టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్ రూ.130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30గా నిర్ణయించారు. ఆన్లైన్లో, తపాలా శాఖ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు 99639 55585, 0877–2264209 నంబర్లలో సంప్రదించవచ్చు. (క్లిక్ చేయండి: పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్) -
రకరకాల డైరీలు.. జ్ఞాపకాలను దాచేయండి
సాక్షి, కడప కల్చరల్: ప్రతిరోజు ఓ జ్ఞాపకం.. ఏడాది పొడవునా మనసును తాకిన సంఘటనలన్నీ స్మృతి నుంచి జారిపోకుండా జ్ఞాపకాల దొంతరగా పేర్చుకునేందుకు మంచి అవకాశం. ఏరోజుకారోజు మనసును కదిలించిన సంఘటనలు.. కమ్మని జ్ఞాపకాలు.. ఉద్వేగాలు.. విషాదాలు.. ఇలా అన్నింటినీ క్లుప్తంగా, పదిలంగా దాచుకునే చోటు డైరీ. ఆ తర్వాత ఎప్పుడో తీరిక వేళల్లో ఒక్కొ పేజీ తిరిగేస్తుంటే ఆ జ్ఞాపక పుటల్లో సంతోషాలు, భావోద్వేగాలు ఇలా ఎన్నెన్నో తియ్యని గాయాలు, మూడ్ వచ్చినపుడు రాసుకునే చిన్న గేయాలు, మధురమైన జ్ఞాపకాలు అన్నీ మనసుకు ప్రతిబింబాలు. రోజువారి జీవితంలో జరిగే సంఘటనలను వరుసగా క్రమపద్ధతిలో రాసుకునేందుకు డైరీ ఎంతగానో పనికి వస్తుంది. జరిగిన విషయాలేగాక వాటి పట్ల మన ప్రతి స్పందనను కూడా పొందుపరచవచ్చు. వర్తమానం గతమై, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేందుకు డైరీ మంచి మిత్రుడిగా ఉపయోగపడుతుంది. ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలను డైరీ పంచుకోవచ్చు. తీపి జ్ఞాపకం ఓ మోస్తరు డబ్బు ఉన్న వాళ్ల నుంచి అతంత్య ధనికులైన వారికి మాత్రమే పరిమితమై ఉండిన డైరీ ఆ తర్వాత మధ్యతరగతి వరకు వచ్చింది. మొన్నమొన్నటి వరకు ఆధునిక జీవితంలో డైరీలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో ఇటీవల జోరు తగ్గినా నేటికీ వీటిని వాడేవారి సంఖ్య తక్కువేమి కాదు. అందులో బరువు దించుకుంటేగానీ మనసు తేలిక పడదని భావించే వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు గతం పేజీలు తిరిగేస్తే డైరీల్లో మనం రాసుకున్న విషయాలు రాసింది మనమేనా అని ఆశ్చర్యం వేస్తోంది. కావాల్సినపుడు తిరిగేసుకుని ఆ జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు డైరీలను వీలైనంత ఎక్కువకాలం ఓ మధురమైన నిధిలా దాచుకుని ఆనందిస్తుంటారు. ఎన్నో రకాలు డైరీలను పలు రకాలుగా వాడేవారు కూడా ఉన్నారు. తమ అనుభూతులను భావుకంగా కవితల్లా రాసుకునే వారు ...అడ్రసులు, ఫోన్ నంబర్లు రాసుకునే వారు, చివరికి లాండ్రి పద్దు రాసుకునే వారు కూడా లేకపోలేదు. మొత్తంపై డైరీ రాయడం హుందాతనానికి గుర్తుగా భావిస్తారు. కొన్నేళ్ల తర్వాత మనం రాసిన విషయాలు మనకే గమ్మత్తుగా అనిపిస్తాయి. అందుకే పలువురికి నేటికీ డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఎందరో మహానుభావులు అలా రాసిన ఆ డైరీలు తర్వాత కొన్నేళ్లకే మంచి గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక గ్రంథాలుగా మారి చరిత్ర సృష్టించాయి. డైరీ రాసే వారి కోసం సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లలో రకరకాల, రంగురంగుల డైరీలు కళకళలాడుతాయి. ఎన్ని రకాల డైరీలున్నా టీటీడీ డైరీకి మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇటీవల కేవలం టీటీడీ అనుబంధ సంస్థల కౌంటర్లలోనే విక్రయిస్తున్నారు. ఖరీదైన లెదర్, రెగ్జిన్ లెదర్ బైండింగ్ గలవి, పర్సు, పెన్ స్టాండ్, గడియారం, క్యాలికులేటర్లు సౌకర్యం గలవి కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద నగరాలలో 8జీబీ పెన్‌డ్రై వ్, గడియారం, క్యాలిక్యులేటర్, పెన్, కంపాస్ సెట్ తదితరాల కాంబినేషన్లో కూడా లభిస్తున్నాయి. పెట్టెలలాగా తాళం వేసుకునే అవకాశం గల డైరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశదేశాల మ్యాపులు, సమయాలు, రాజధానులు, పిన్‌కోడ్, ఫోన్ కోడ్ నెంబర్లు, పోస్టల్, రైల్వే సమాచారం, ప్రకృతి, ఆధ్యాత్మికం, సామాజిక సేవ, ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ అంశాలను దాదాపు ప్రతి పేజీలో పొందుపరిచిన డైరీలు కూడా లభిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వైద్యులు తదితర ఉద్యోగాల్లో ఉన్న వారికి అసవరమైన సమాచారంతో కూడిన డైరీలు కూడా లభిస్తుండడం విశేషం. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, కంపెనీలు నూతన సంవత్సర కానుకగా డైరీలు అందజేస్తున్నాయి. ఉద్యోగుల్లో సంఘాల ద్వారా కూడా తమకు సంబంధించిన వివరాలు, జీఓలతో ప్రత్యేకంగా డైరీలను రూపొందిస్తున్నారు. మంచి హాబీని మనం కొనసాగిస్తూ పిల్లలకు కూడా అలవాటు చేద్దాం! -
ఆన్లైన్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
తిరుపతి సెంట్రల్: టీటీడీ 2021 క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. వీటిని పోస్టు ద్వారా కూడా భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ‘ఈవో, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటీ.రోడ్, తిరుపతి’ అనే చిరునామాకు పంపాలి. టు పే విధానం (పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు క్యాలెండర్, డైరీలను టీటీడీ పంపనుంది. మరింత సమాచారం కోసం 0877– 2264209, 9963955585 నంబర్లను సంప్రదించాలి. (చదవండి: లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం) టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో మూసివేసిన మార్గాలను పునరుద్ధరిస్తుంది. గురువారం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే, దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బందితో నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. అలాగే రెండు ఘాట్ రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. పూర్వ కాలం నుంచి తిరుమల కొండకు రెండు సోపాన మార్గాలున్నాయి. మొదటిది శ్రీవారి మెట్టు. దీన్నే నూరు మెట్ల దారి అంటారు. ఇది శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్గం గుండా భక్తులను అనుమతినిస్తున్నట్లు టీటీడీ సెక్యూరిటీ అధికారి గోపినాధ్ జెట్టి పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని సివియస్ఓ గోపినాధ్ జెట్టి తనిఖీ చేశారు. లాక్డౌన్లో కృర మృగాలు మెట్ల మార్గంలో వస్తుండటంతో శ్రీవారి మెట్లను గతంలో మూసి వేశారు. నేడు భక్తులు సంఖ్య పెరగడంతో మెట్ల మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసారు. -
టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు ఆన్లైన్ బుకింగ్
తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)– 2018 డైరీలు, క్యాలెండర్ల కోసం భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో జేఈవో పోలా భాస్కర్‌తో కలసి ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వీటిని ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయొచ్చన్నారు. -
నేటి నుంచి టీటీడీ డైరీ, క్యాలెండర్ల విక్రయం
నెల్లూరు(బృందావనం): స్థానిక రాంనగర్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం నుంచి టీటీడీ 2017వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు విక్రయించనున్నట్లు టీటీడీ కల్యాణ మండపం మేనేజర్ రాంగోపాల్ తెలిపారు. బుధవారం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను తన సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవస్థానం నుంచి నెల్లూరులో విక్రయించేందుకు '100విలువ చేసే డైరీలు మూడువేలు, పన్నెండు షీట్ల క్యాలెండర్లు 4500, సాధారణ క్యాలెండర్లు రెండు వేలు, తెలుగు క్యాలెండర్లు వెయ్యి సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిలో డైరీ 100, 12షీట్ల క్యాలెండర్ ఒక్కొక్కటి రూ.75, సాధారణ క్యాలెండరు రూ.10, తెలుగుక్యాలెండరు రూ.15గా విక్రయించనున్నామన్నారు. గూడూరు మాళవ్యనగర్లో ఉన్న టీటీడీ కల్యాణమండపంలో అందుబాటులో ఉంచుతామన్నారు. -
మంత్రి 100 అడిగితే...10 ఇచ్చారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు దీనస్థితి మరోసారి చర్చనీయంశమైంది. దేవాదాయశాఖలో అధికారులదే అధిపత్యంగా నడుస్తుంది. మంత్రిని ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అధికారులు పూర్తిగా పక్కనపెట్టేశారు. మంత్రి మాణిక్యాలరావు నోటీసులో లేకుండానే అధికారులు జీవోలు జారీ చేస్తున్నారు. తాజాగా స్వయనా దేవాదాయ శాఖమంత్రి లేఖలను టీటీడీ పట్టించుకోలేదు. దర్శనం కోసం మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినా టీటీడీ బుట్టదాఖలు చేసింది. సాక్షాత్తూ టీటీడీ కొత్త సంవత్సరం దేవుడి డైరీలు దక్కకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. 100 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు కావాలని మాణిక్యాలరావు ఆర్డర్ చేస్తే కేవలం పదే డైరీలు, క్యాలెండర్లు ఇచ్చి టీటీడీ చేతులు దులుపుకుంది. దీంతో మంత్రి తీవ్ర అసహానానికి గురైనట్లు తెలుస్తుంది. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం పరిమితం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.