ఆర్డీఎస్ కాల్వలో తుంగభద్ర పరవళ్లు
మహబూబ్‌నగర్: తుంగభద్ర నీటితో ఆర్డీఎస్ కాల్వ కళకళలాడుతోంది. ఏటా ఖరీఫ్‌నకు కూడా సాగునీరు సరిగా అందించలేని ఆర్డీఎస్ మే నెలలోనూ ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురియటంతో తుంగభద్ర నీటి ఉధృతి పెరిగింది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద నీటి ప్రవాహం పెరగటంతో స్థానిక ప్రాజెక్టు అధికారులు కర్ణాటక నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎగువన ఉన్న 12 తూములను మూసివేయించారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ 29 వరకు నీరు చేరింది. మరో మూడు రోజుల పాటు జిల్లాలోని శాంతినగర్ మండల పరిధిలోని కెనాల్లో నీరు ప్రవహించే అవకాశం ఉంది.